‘సలార్’ సాగా స్టార్ట్..ఒకే ఫ్రేంలో ప్రభాస్, యశ్

by  |
Salaar Launch
X

దిశ, వెబ్ డెస్క్: ‘సలార్’ సాగా స్టార్ట్ అయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్’లో వస్తున్న ‘సలార్’ మూవీ లాంచింగ్ గ్రాండ్‌గా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి రాకీ భాయ్ యశ్ హాజరు కాగా, ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. జనవరి లాస్ట్ వీక్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుందన్న న్యూస్‌తో సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న సినిమాను #Salaarsaaga, #Salaarlaunch హ్యాష్‌టాగ్స్‌తో ట్రెండింగ్‌లోకి తెచ్చిన ఫ్యాన్స్.. ప్రభాస్ మోస్ట్ వాయిలెంట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు.

‘సలార్’ పూజా కార్యక్రమం గురించి తెలుపుతూ ట్వీట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ఈ అవకాశం ఇచ్చిన హీరో ప్రభాస్, నిర్మాత విజయ్ కిరగందుర్‌కు థాంక్స్ చెప్పారు. లాంచింగ్ ప్రోగ్రాంకు అటెండ్ అయిన యశ్‌కు స్పెషల్ థాంక్స్ చెప్పిన డైరెక్టర్..‘సలార్’ ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ కు మించి ఉంటుందని తెలిపారు. అభిమానులను నిరాశ పరిచేదే లేదని ప్రామిస్ చేసిన ఆయన..ఎప్పటికీ ఇలాంటి ప్రేమనే అందించాలని కోరారు.



Next Story

Most Viewed