- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దటీజ్ సజ్జనార్ : వారందరికీ బస్సులో ఫ్రీ ప్రయాణం
<p>దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో మంగళవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం, ప్రహరి ట్రస్ట్, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసేవారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికీ రేపు(మంగళవారం) ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అందించేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మరింత […]</p>

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో మంగళవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం, ప్రహరి ట్రస్ట్, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసేవారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
రక్త దానం చేసిన ప్రతి ఒక్కరికీ రేపు(మంగళవారం) ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అందించేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో మరింత మంది రక్తదానం చేసేందుకు ముందుకు వస్తారని ఆర్టీసీ ఆశిస్తోంది. కొవిడ్ కారణంగా గత ఏడాదిన్నరగా రక్తం దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారని.. బ్లడ్ డొనేట్ చేసేందుకు ముందుకు రావాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.
To Promote #BloodDonation #TSRTC is offering free transportation only on 30th Nov 2021 to the #BloodDonors on their way back Who donated blood in #MegaBloodDonationCamp for more details kindly contact Nearest depot managers @TSRTCHQ #DonatebloodSaveLives#IchooseTSRTC @BloodAid pic.twitter.com/WesvT1UIun
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) November 29, 2021






