రూ. 5 అవినీతికి వెయ్యి ఫైన్.. సజ్జనార్ తనదైన మార్క్

by Shyam |   (  Updated:2021-10-16 09:39:47  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎక్కడ పనిచేస్తే అక్కడ తనదైన ముద్ర వేసుకుంటారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న సమయంలో అటు అవగాహన క్యాంపెయిన్స్‌తో పాటు పనిష్‌మెంట్ కూడా తనదైన శైలిలో చూపించారు. ఇప్పుడు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా అదే మార్కు పనితీరును చూపిస్తున్నారు. ఆర్టీసీ సంస్థను గాడిలో పెడతానంటూ హామీ ఇచ్చిన ఆయన అవినీతి, అక్రమాలపై దృష్టి పెట్టారు. దసరా పండుగ సందర్భంగా బస్ స్టేషన్లలో అధిక [&hellip;]</p>

MD sajjanar
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఎక్కడ పనిచేస్తే అక్కడ తనదైన ముద్ర వేసుకుంటారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా ఉన్న సమయంలో అటు అవగాహన క్యాంపెయిన్స్‌తో పాటు పనిష్‌మెంట్ కూడా తనదైన శైలిలో చూపించారు. ఇప్పుడు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా అదే మార్కు పనితీరును చూపిస్తున్నారు. ఆర్టీసీ సంస్థను గాడిలో పెడతానంటూ హామీ ఇచ్చిన ఆయన అవినీతి, అక్రమాలపై దృష్టి పెట్టారు. దసరా పండుగ సందర్భంగా బస్ స్టేషన్లలో అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఉచితంగా మరుగుదొడ్డి వాడుకునే దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేయడంపై ఫైర్ అయ్యారు.

నగరంలోని ప్రధాన బస్ స్టేషన్‌గా ఉన్న ఎంజీబీఎస్‌లో ఆకస్మిక తనిఖీ చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రయాణికుల అవసరాన్ని సొమ్ము చేసుకునే చిరు వ్యాపారులు రూ.30 కు అమ్మాల్సిన బిస్కెట్ ప్యాకెట్లను మరో ఐదు రూపాయాలకు అదనంగా అమ్ముతుండడాన్ని పసిగట్టారు. వెంటనే స్పాట్ ఫైన్‌గా వెయ్యి రూపాయలు పెనాల్టీ విధించారు. ఫ్రీగా టాయ్‌లెట్లను వాడుకోవాల్సి ఉన్నా మూత్ర విసర్జనకు సైతం ఐదు రూపాయలను వసూలు చేయడాన్ని తప్పుపట్టారు. నిర్వాహకులకు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. పలు చిరు దుకాణాలపైనా ఇదే తరహా తనిఖీలు చేపట్టి స్పాట్ ఫైన్ వసూలు చేశారు. మంచినీళ్ల బాటిల్, బిస్కెట్ ప్యాకెట్ల లాంటివాటిపై గరిష్ట చిల్లర ధర ముద్రించి ఉంటుందని, దానికంటే అదనంగా వసూలు చేస్తే ఆ దుకాణంపై ఫిర్యాదు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story