- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రక్తదానానికి అందరూ ముందుకు రావాలి: సజ్జనార్
<p>దిశ ప్రతినిధి , హైదరాబాద్: కరోనా కారణంగా నగరంలోని బ్లడ్ బ్యాంక్ లలో రక్తం కొరత ఏర్పడిందని తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది, కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూచించారు. ఆర్టీసీలో పని చేసే సిబ్బందికి యాజమాన్యం100 శాతం వ్యాక్సిన్ ఇచ్చిందని, కొత్త వేరియంట్ పై బయపడవలసిన అవసరం లేదన్నారు. ఈ మేరకు మంగళవారం ఏంజీబీఎస్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంయుక్త ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును […]</p>

దిశ ప్రతినిధి , హైదరాబాద్: కరోనా కారణంగా నగరంలోని బ్లడ్ బ్యాంక్ లలో రక్తం కొరత ఏర్పడిందని తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది, కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూచించారు. ఆర్టీసీలో పని చేసే సిబ్బందికి యాజమాన్యం100 శాతం వ్యాక్సిన్ ఇచ్చిందని, కొత్త వేరియంట్ పై బయపడవలసిన అవసరం లేదన్నారు. ఈ మేరకు మంగళవారం ఏంజీబీఎస్ లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంయుక్త ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును హైదరాబాద్ కలెక్టర్ తో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శర్మణ్ మాట్లాడుతూ.. రక్త దానం చేయడం మూలంగా వివిధ కారణాలవల్ల రక్తం అవసరం అయ్యే వారికి,ప్రాణాపాయంలో ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు, ఆపరేషన్ చేసే వారికి, క్యాన్సర్ రోగులకు ఈ రక్తదాన శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భీమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






