అందుకోసమే జగన్ ఢిల్లీ పర్యటన: సజ్జల

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి రావల్సిన నిధుల కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావల్సిన నిధులపై చర్చించేందుకే వెళ్లారని స్పష్టం చేశారు. పోలవరం నిధుల వంటి అంశాలపైనే సీఎం జగన్.. హోంమంత్రి అమిత్ షాను కలుస్తున్నారన్నారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణలో వాస్తవాలు [&hellip;]</p>

అందుకోసమే జగన్ ఢిల్లీ పర్యటన: సజ్జల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రానికి రావల్సిన నిధుల కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావల్సిన నిధులపై చర్చించేందుకే వెళ్లారని స్పష్టం చేశారు. పోలవరం నిధుల వంటి అంశాలపైనే సీఎం జగన్.. హోంమంత్రి అమిత్ షాను కలుస్తున్నారన్నారు. ఇన్‌సైడ్ ట్రేడింగ్‌పై సీబీఐ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, కొడాలి నాని, దేవినేని ఉమ ఎపిసోడ్‌లో బాధ్యత టీడీపీదేనని సజ్జల పేర్కొన్నారు.

Next Story