- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటున్నాయి: సజ్జల
<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటూ ప్రమాదరకర రాజకీయాలు చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భద్రతలేని దేవాలయాలను టార్గెట్ చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. మతపరమైన అంశాలపై మేము ఎప్పుడైనా ఉద్యమాలు చేశామా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు మతం ఆధారంగా రాజకీయం చేస్తున్నారని, దివాళా తీసిన టీడీపీకి మత రాజకీయాలతో ఏం లాభం అన్నారు. పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్‌తో ఎంతమంది చనిపోయారని […]</p>

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటూ ప్రమాదరకర రాజకీయాలు చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భద్రతలేని దేవాలయాలను టార్గెట్ చేస్తూ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. మతపరమైన అంశాలపై మేము ఎప్పుడైనా ఉద్యమాలు చేశామా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు మతం ఆధారంగా రాజకీయం చేస్తున్నారని, దివాళా తీసిన టీడీపీకి మత రాజకీయాలతో ఏం లాభం అన్నారు. పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్‌తో ఎంతమంది చనిపోయారని గుర్తుచేశారు.
మతం పూర్తిగా వ్యక్తిగతమైందని, ఎవరి విశ్వాసాలు వారివన్న సజ్జల.. కుల, మతాలకు అతీతంగా పనిచేస్తున్నామని తెలిపారు. రామతీర్థం ఘటన పథకం ప్రకారమే జరిగిందని, ఉన్మాద స్థాయిలో ఉన్నవారే విధ్వంసానికి పాల్పడారని విమర్శించారు. ఇలాంటి నీచ రాజకీయాలను సీఎం జగన్ సహించరని పేర్కొన్నారు.






