- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చంద్రబాబును ప్రజలే తరిమికొడతారు
దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్ష నేత చంద్రబాబు ధోరణి మారకపోతే ప్రజలే తరిమికొడతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చంద్రబాబుకు అవసరం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని విమర్శించారు. మహానగరాన్ని నిర్మిస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని, రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారని ఆరోపించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగక పోతే దారి కూడా తెలియని ప్రాంతానికి వెళ్లి ఎలా వేల ఎకరాలు కొనుగోలు చేశారని ప్రశ్నించారు.
వికేంద్రీకరణ వల్ల నిజమైన రైతులెవరికీ అన్యాయం జరగదని సజ్జల స్పష్టం చేశారు. సింగపూర్ కంపెనీ, కోర్ క్యాపిటల్‌లో అంతా చంద్రబాబు బినామీలే ఉన్నారని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే ప్రజలందరికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేశారని, అన్నిప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు.