సైఫ్ ఇంట్లో.. ఫ్యామిలీ గెట్ టుగెదర్

by  |
సైఫ్ ఇంట్లో.. ఫ్యామిలీ గెట్ టుగెదర్
X

లాక్‌డౌన్ టైమ్‌లో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌లు.. పిల్లలతో స‌ర‌దాగా గ‌డిపిన విష‌యం తెలిసిందే. కొద్దిరోజుల కిందట కొడుకు తైమూర్‌తో సైఫ్, కరీనాలు బీచ్‌లోనూ దర్శనమిచ్చారు. తాజాగా వీకెండ్ వేళ సైఫ్.. తన ఇంట్లోనే ‘ఫ్యామిలీ గెట్ టుగెదర్’ నిర్వహించాడు. ఈ ఫ్యామిలీ పార్టీకి సైఫ్ చెల్లెలు సోహా అలీ ఖాన్, తన భర్త కునాల్ ఖేము కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శనివారం సోహా అలీఖాన్.. మేనల్లుడు తైమూర్, కూతురు ఇనాయల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి బాగా వైరల్ అయ్యాయి.

ఈ ఫొటోలో తైమూర్ బ్యాట్‌మన్‌గా కనిపించగా, ఇనాయ బ్యాట్‌గర్ల్‌గా మెరిసింది. వీరిద్ద‌రి ఫొటోల‌కు నెటిజ‌న్స్ ల‌వ్‌లీ కామెంట్స్ పెడుతున్నారు. దీనికి ఆఫీసులో నిశ్శ‌బ్ధ‌మైన రోజు అని సోహా క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ఇక సైఫ్‌ మరో కుమారుడు ఇబ్రహీం, కూతురు సారా అలీఖాన్‌ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్‌ కిడ్స్‌ ముంబై వీధుల్లో ఇటీవలే సైక్లింగ్‌ చేశారు. సారా, ఇబ్రహీం ముఖాలకు మాస్క్‌ పెట్టుకుని సైకిల్‌పై ఉన్న ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. వైరల్‌ అవుతున్నాయి. ఇలా ఫ్యామిలీ అంతా వీకెండ్ బాగా ఎంజాయ్ చేసి.. ఆదివారం ఎవరి కార్లలో వారు కొవిడ్ 19 రూల్స్ పాటిస్తూ వెళ్లిపోయారు.



Next Story

Most Viewed