ఒక్కటన్నా రాలేదు.. ఆ హీరోయిన్ అప్పుడే బిజీనా!

by  |
ఒక్కటన్నా రాలేదు.. ఆ హీరోయిన్ అప్పుడే బిజీనా!
X

దిశ, వెబ్‌డెస్క్ : పాపులర్ యాక్టర్, డైరెక్టర్ మహేశ్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్ ‘దబాంగ్ 3’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అడవి శేషు ‘మేజర్’ ద్వారా టాలీవుడ్‌లోనూ ఎంటర్ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే వరుణ్ తేజ్ మూవీలోనూ ఫీమేల్ లీడ్‌గా సెలెక్ట్ అయిన భామ.. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం మరిన్ని మూవీస్ లైన్‌లో పెట్టేసిందని సమాచారం. ‘దబాంగ్ 3’లో చిల్‌బుల్ పాండే లవర్‌గా మెస్మరైజ్ చేసిన సాయి.. టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్స్ కొట్టేసిందట. అల్లు అర్జున్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఇప్పటికే ఫైనల్ అయిందని తెలుస్తుండగా.. పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్‌ మూవీలోనూ తన పేరే పరిశీలనలో ఉందని సమాచారం. శేషు, వరుణ్ తేజ్‌తో సినిమాలు సక్సెస్ అయి.. బన్నీ, పవన్ కళ్యాణ్‌తో ప్రాజెక్ట్స్ చేస్తుండటం నిజమైతే, తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారడం పక్కా అని చెప్తున్నారు విశ్లేషకులు.

Next Story

Most Viewed