- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్.. రాజు గెటప్ మారిస్తే ఇలా ఉంటాడు
<p>దిశ, డైనమిక్ బ్యూరో : సినిమాల్లో విలన్లు ఎలా ఉంటారు.. పూటకో వేషం మార్చుతూ నేరాలకు పాల్పడుతుంటారు. పొడవైన జుట్టు, బోడిగుండు, మీసాలు లేకుండా ఇలా.. రకరకాల వేషధారణలతో పోలీసులను బురిడి కొట్టిస్తూ క్రైం చేస్తుంటారు. అచ్చం అలాగే జరుగుతుందేమోనని ఊహించిన హైదరాబాద్ పోలీసులు నేరస్తుడిని పట్టుకోవడానికి పకడ్భందీ ప్లాన్ వేశారు. సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడిని పట్టుకోవడానికి ఉపయోగపడే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే నిందితుడు రాజును పట్టుకునేందుకు పోలీసులు అన్ని రకాలుగా […]</p>

దిశ, డైనమిక్ బ్యూరో : సినిమాల్లో విలన్లు ఎలా ఉంటారు.. పూటకో వేషం మార్చుతూ నేరాలకు పాల్పడుతుంటారు. పొడవైన జుట్టు, బోడిగుండు, మీసాలు లేకుండా ఇలా.. రకరకాల వేషధారణలతో పోలీసులను బురిడి కొట్టిస్తూ క్రైం చేస్తుంటారు. అచ్చం అలాగే జరుగుతుందేమోనని ఊహించిన హైదరాబాద్ పోలీసులు నేరస్తుడిని పట్టుకోవడానికి పకడ్భందీ ప్లాన్ వేశారు. సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడిని పట్టుకోవడానికి ఉపయోగపడే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు.
ఇప్పటికే నిందితుడు రాజును పట్టుకునేందుకు పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. రాజును పట్టిస్తే రూ.10 లక్షలు రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నిందితుడి కదలికలను తెలుసుకునేందుకు నగరంలోని వెయ్యి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజలను నిందితుడు తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని భావించిన పోలీసులు.. ఒకవేళ రాజు గెట్‌అప్ మారుస్తే ఎలా ఉంటాడో తెలుపుతూ కొన్ని చిత్రాలు విడుదల చేశారు. వాటిని ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌ని హీరో మంచు మనోజ్‌తో పాటు పలువురు నెటిజన్లు రీట్వీట్లు చేస్తున్నారు. వాటిపై మీరూ ఓ లుక్కేయండి.
https://twitter.com/HeroManoj1/status/1438110548332142597?s=20






