వందేళ్లు వచ్చినా సరే.. నా బేబీ నువ్వు: సాయి పల్లవి

by  |
వందేళ్లు వచ్చినా సరే.. నా బేబీ నువ్వు: సాయి పల్లవి
X

“ఫిదా” హీరోయిన్ సాయి పల్లవి తన సోదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అందరినీ ఫిదా చేసేసింది. తన చెల్లికి తన జీవితంలో ఎంత ప్రాధాన్యత ఉందో తెలుపుతూ విష్ చేసిన విధానం వావ్ అనిపించింది. అక్కాచెల్లెళ్ల మధ్య అనుబంధం ఇంత గొప్పగా ఉంటుందా అనేలా చేసింది. సిస్టర్ పూజ కన్నన్ నిజంగా అదృష్టవంతురాలు అనిపించేలా ఉంది పోస్ట్. చిన్నప్పుడు తన చెల్లిని ఎత్తుకున్న ఫోటోతో పాటు ప్రజెంట్ పిక్స్ షేర్ చేసిన సాయి పల్లవి… తన చెల్లిని ప్రేమకు నిర్వచనంగా అభివర్ణించింది.

” పూజా… నువు నా కోసం ఎన్నో త్యాగాలు చేశావ్… ఎంతో రాజీ పడ్డావ్.. నా జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చావ్.. నా వ్యవస్థకు సంతోషాన్ని తీసుకొచ్చావు.. అన్ని వేళలా నవ్వుతూనే కనిపించావు.. నువు నా లైఫ్ లో ఉండడం నిజంగా నాకు ఆశీర్వాదం.. నువు నా బేబివి.. నీకు వందేళ్లు వచ్చినా సరే… నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను తెలియాలంటే నువు నాలా మారాలి అంతే. నిన్ను పొందడం ఒక అదృష్టమని తెలిపేందుకు… ఈ రోజు ఒక రిమైండర్ … హ్యాపీ బర్త్ డే మంకీ… ” అంటూ విష్ చేసింది సాయి పల్లవి.

Tags : Sai Pallavi, Puja Kannan, Birthday Wish, Netizens

Next Story

Most Viewed