- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్లీజ్ అలా పిలవొద్దు : సాయి పల్లవి
<p>‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి తొలి చిత్రం.. ‘ప్రేమమ్’. నివిన్ పౌలి హీరోగా వచ్చిన ఈ మలయాళీ చిత్రంలో తన నటనతో అక్కడి ప్రేక్షకులను ముగ్ధులను చేసింది ఈ హీరోయిన్. యాక్టింగ్, డాన్సింగ్‌తో అదరగొట్టిన అమ్మడు.. ఈ మూవీ క్యారెక్టర్ ‘మలార్’గా ప్రేక్షకుల గుర్తింపు పొందింది. దీంతో తనను మలార్ బ్యూటీ, మలయాళీ, మల్లు గర్ల్‌గా పిలుస్తుంటారు. చాలా మీడియా పత్రికలు కూడా అలాగే ప్రచురిస్తాయి. ఐతే తమిళనాడుకు చెందిన తనను […]</p>

‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి తొలి చిత్రం.. ‘ప్రేమమ్’. నివిన్ పౌలి హీరోగా వచ్చిన ఈ మలయాళీ చిత్రంలో తన నటనతో అక్కడి ప్రేక్షకులను ముగ్ధులను చేసింది ఈ హీరోయిన్. యాక్టింగ్, డాన్సింగ్‌తో అదరగొట్టిన అమ్మడు.. ఈ మూవీ క్యారెక్టర్ ‘మలార్’గా ప్రేక్షకుల గుర్తింపు పొందింది. దీంతో తనను మలార్ బ్యూటీ, మలయాళీ, మల్లు గర్ల్‌గా పిలుస్తుంటారు. చాలా మీడియా పత్రికలు కూడా అలాగే ప్రచురిస్తాయి.
ఐతే తమిళనాడుకు చెందిన తనను మలయాళీగా పిలవడం తనకు ఇష్టం లేదని చెప్తోంది సాయి పల్లవి. కోయంబత్తూరులో పుట్టి పెరిగిన తనను తమిళ్ గాళ్‌గా కాకుండా మలయాళీ కుట్టిగా పరిగణించకూడదని కోరుతోంది. తాజాగా ఓ తెలుగు మాగజైన్ తనను ‘మల్లు గాళ్’గా అభివర్ణిస్తూ ఆర్టికల్ రాయగా.. ఇలా రాయడం తనకు ఇష్టం లేదని.. తను పర్‌ఫెక్ట్ తమిళియన్ అని చెప్పిందట.
కాగా సాయి పల్లవి ప్రస్తుతం విరాట పర్వంలో పవర్‌ఫుల్ రోల్ చేస్తుండగా.. లవ్ స్టోరీలో చైతు లవర్‌గా కనిపించబోతోంది.






