మీకు జీవితాంతం రుణపడి ఉంటాం : సాయి పల్లవి

by Shyam |

<p>సాయి పల్లవి&#8230; ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. తెలంగాణ యాసలో డైలాగ్ డెలివరీతో దుమ్ము దులిపిన ఈ రౌడీ పిల్ల&#8230; తన నటనతో తెలుగు ప్రజలకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ సినిమా చేస్తోన్న మలయాళీ కుట్టీ&#8230; తమిళ్, మలయాళీ చిత్రాలతో నూ బిజీగా ఉంది. కాగా మలయాళీల &#8220;విషు&#8221; పండగను పురస్మరించుకుని శుభాకాంక్షలు తెలిపింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒకరికి ఒకరం సహాయం చేసుకుందామని పిలుపునిచ్చింది. [&hellip;]</p>

మీకు జీవితాంతం రుణపడి ఉంటాం : సాయి పల్లవి
X

సాయి పల్లవి… ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. తెలంగాణ యాసలో డైలాగ్ డెలివరీతో దుమ్ము దులిపిన ఈ రౌడీ పిల్ల… తన నటనతో తెలుగు ప్రజలకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ సినిమా చేస్తోన్న మలయాళీ కుట్టీ… తమిళ్, మలయాళీ చిత్రాలతో నూ బిజీగా ఉంది. కాగా మలయాళీల “విషు” పండగను పురస్మరించుకుని శుభాకాంక్షలు తెలిపింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఒకరికి ఒకరం సహాయం చేసుకుందామని పిలుపునిచ్చింది. నిస్వార్థ సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి, పోలీసులకు ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపింది సాయి. దేశాన్ని శుభ్రంగా ఉంచేందుకు సహాయ పడుతున్న పారిశుధ్య సిబ్బందికి చెందిన అన్నలు, అక్కలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పారు సాయి పల్లవి.

తెలుగులో నాగచైతన్య సరసన లవ్ స్టొరీ మూవీలో నటిస్తున్న సాయి పల్లవి… రానా హీరోగా వస్తున్న విరాటపర్వం చిత్రంలో కీలక పాత్ర చేస్తోంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియమణి కూడా నటిస్తున్నారని సమాచారం.


Tags: Sai Pallavi, Naga Chaitanya, Rana, Tollywood

Next Story