- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తేజకు నో చెప్పిన సాయి పల్లవి..
<p>నటనా ప్రాధాన్యమున్న పాత్రలు చేసే సాయి పల్లవి.. ఏదైనా సినిమాకు సైన్ చేయాలంటే చాలా ఆలోచిస్తుంది. ఒకవేళ పాత్ర నచ్చకపోతే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే, నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకుడు నుంచి వచ్చిన బిగ్ ఆఫర్‌ను తిరస్కరించిదట ఈ ఫిదా బ్యూటీ. గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అలివేలుమంగ వెంకటరమణ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా హీరోయిన్‌గా సాయిపల్లవి అయితే బాగుంటుంది అనుకున్నారట తేజ. ఈ […]</p>

నటనా ప్రాధాన్యమున్న పాత్రలు చేసే సాయి పల్లవి.. ఏదైనా సినిమాకు సైన్ చేయాలంటే చాలా ఆలోచిస్తుంది. ఒకవేళ పాత్ర నచ్చకపోతే ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే, నిర్మొహమాటంగా నో చెప్పేస్తుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకుడు నుంచి వచ్చిన బిగ్ ఆఫర్‌ను తిరస్కరించిదట ఈ ఫిదా బ్యూటీ. గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అలివేలుమంగ వెంకటరమణ’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా హీరోయిన్‌గా సాయిపల్లవి అయితే బాగుంటుంది అనుకున్నారట తేజ. ఈ క్యారెక్టర్ కోసం తనను సంప్రదించగా స్టోరీ నచ్చలేదని ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందట ఈ భామ. దీంతో ఇప్పుడు మరో హీరోయిన్ వెతికే పనిలో ఉన్నాడు తేజ. అయితే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి.. ఇంతకు ముందు గోపీ చంద్‌తో కలిసి నటించిన లేడీ సూపర్‌స్టార్ అనుష్కను ఓకే చేయించే ప్రయత్నంలో ఉన్నారట తేజ. మరి ఈ ప్రయత్నం ఫలిస్తుందో లేదో చూడాలి.
ప్రస్తుతం తెలుగులో విరాటపర్వం, లవ్ స్టోరీ సినిమాలు చేస్తున్న సాయిపల్లవి.. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటాననే నమ్మకంతో ఉంది. కాగా ఈ రెండు సినిమాల్లోనూ డిఫరెంట్ లుక్స్‌తో ఇప్పటికే అదరగొట్టేసింది ఈ మలార్ బ్యూటీ.






