ఆ ఇండస్ట్రీని కూడా వదలేది లేదంటున్న స్టార్ హీరోయిన్..?

by  |
ఆ ఇండస్ట్రీని కూడా వదలేది లేదంటున్న స్టార్ హీరోయిన్..?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఫిదా’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సాయి పల్లవి. అందం, అభినయంతో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న ఈ భామా అటు టాలీవుడ్ లోను, ఇటు కోలీవుడ్ లోను వరుస అవకాశాలను అందుకొంటూ బిజీగా మారింది. ఇక తాజాగా సాయి పల్లవి కన్నడలో పాగా వేయడానికి సిద్ధమవుతోందట. నేష‌న‌ల్ అవార్డు విన్నింగ్ క‌న్న‌డ డైరెక్ట‌ర్ మ‌న్సోర్ తన కొత్త చిత్రం కోసం సాయి పల్లవిని సంప్రదించినట్లు సమాచారం.

పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి లీడ్ రోల్ లో కనిపించనుందట. కథ నచ్చడంతో అమ్మడు కూడా వెంటనే ఓకే చెప్పినట్లు టాక్. ఇక ఇదే నిజమైతే సాయి పల్లవి యాక్టింగ్ కి శాండల్ వుడ్ కూడా ఫిదా కావాల్సిందేనని అంటున్నారు ఆమె అభిమానులు. ఇకపోతే ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో నాగ చైతన్య సరసన ‘లవ్ స్టోరీ’ చిత్రంలో కనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.


Next Story

Most Viewed