అమ్మ నాన్న.. ఓ తెలంగాణ అమ్మాయి : ఈ హైబ్రిడ్ పిల్లే!

by  |
Sai Pallavi
X

దిశ, సినిమా : ‘ఫిదా’ మూవీలో హైబ్రిడ్ పిల్లగా కనిపించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి సాయి పల్లవి. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ మలయాళీ భామ.. ఇన్‌స్టాగ్రామ్‌‌లో అభిమానులను మంత్రముగ్దులను చేసే ఫొటోలను షేర్ చేసింది. ఫ్లవర్ డిజైన్‌తో కూడిన నీలిరంగు దుస్తులతో పాటు సిల్వర్ కలర్ చెవిపోగులు ధరించిన బ్యూటీ.. సొగసైన డ్యాన్స్ మూవ్‌లో మాయ చేసింది.

ఇక ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. ‘లెట్స్ డూ ది బూగీ వూగి’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో సాయి పల్లవి లుక్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. ‘అమ్మ నాన్న.. ఓ తెలంగాణ అమ్మాయి’ అని కామెంట్ చేస్తూనే ‘ఈ చిత్రం చూస్తున్నంతసేపు ఏం మట్లాడలేం’ అంటున్నారు. కాగా సాయిపల్లవి ప్రస్తుతం ‘విరాట పర్వం, శ్యామ్ సింగరాయ్‌’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed