అలివేలు మంగగా మలార్ బ్యూటీ

by  |
అలివేలు మంగగా మలార్ బ్యూటీ
X

దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టర్ తేజ ఒకప్పుడు సక్సెస్ ఫుల్ సినిమాలను తెరకెక్కించాడు. ఫ్రెష్ లవ్ స్టోరీస్‌తో యూత్‌ను ఆకట్టుకున్నాడు. కానీ, ఆ తర్వాత ఫెయిల్ అయిపోయాడు. అదే రొటీన్ స్టోరీస్‌ను నమ్ముకోవడం మైనస్ కాగా, చాలా ఏళ్ల తర్వాత రానా దగ్గుబాటి, కాజల్ అగర్వాల్ నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ద్వారా సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ నటించిన ‘సీత’ చిత్రం మళ్లీ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌తో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న డైరెక్టర్ అలివేలు మంగ వెంకటరమణ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే హీరో గోపీచంద్‌ను వెంకటరమణగా ఫైనల్ చేసిన తేజ.. అలివేలు మంగ కోసం వెతుకుతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అనుష్క శెట్టి, కీర్తి సురేష్, కాజల్‌తో పాటు బాలీవుడ్ బ్యూటీ తాప్సీ ఈ సినిమా కోసం డేట్లు సర్దుబాటు చేయలేక పోవడంతో మలార్ బ్యూటీ సాయి పల్లవిని సంప్రదించగా..ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని టాక్. అలివేలు మంగగా తెరపై మరో గొప్ప క్యారెక్టర్ చేయబోతోందని ఫిల్మ్ నగర్ సమాచారం. సాయి పల్లవి ప్రస్తుతం ‘విరాట పర్వం’ ‘లవ్ స్టోరి’ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రాల నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి.



Next Story

Most Viewed