సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ ఇలా జరిగింది.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాద సీసీ ఫుటేజ్ వీడియో

by  |
సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ ఇలా జరిగింది.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాద సీసీ ఫుటేజ్ వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: వినాయకచవితి పండగ పూట మెగా ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా మెగా ఫ్యామిలీ అందరు ఆసుపత్రికి చేరుకొని వైద్యులను తేజ్ ఆరోగ్యపరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఇక తాజాగా తేజు బైక్ యాక్సిడెంట్ కి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ను మాదాపూర్ పోలీసులు విడుదల చేశారు.

జూబ్లీ హిల్స్‌ రోడ్డు నంబర్‌-45 కేబుల్‌ బ్రిడ్జ్‌ మార్గంలో స్పోర్ట్స్‌ బైక్‌పై వెళ్తున్న తేజ్ ముందున్న బైక్.. ఆటోను ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేగంగా వెళుతున్న ఆయన బైక్ ను వంపుగా తిప్పటం.. ముందు చక్రం స్కిడ్ కావటంతో బండి బ్యాలెన్స్ తప్పి కిందపడడం సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం సెకనులో జరిగిన ప్రమాదం.. మూడు నుంచి ఐదు సెకన్ల వ్యవధిలో అతడు అపస్మారక స్థితిలోకి జారిపోవటం గమనార్హం. ప్రస్తుతం ఈ సీసీ టీవీ ఫుటేజ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంకా లక్కీగా తేజు హెల్మెట్ పెట్టుకోవడం వలన తలకు పెద్దగా గాయాలు కాలేదు. దీంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పాలి. ఒళ్లు గగుర్పాటు పొడిచే ఈ రోడ్డు ప్రమాదం చూశాకా మన హైదరాబాద్ రోడ్లు ఎంత అద్వానంగా ఉన్నాయో తెలుస్తోంది.

Next Story

Most Viewed