మెగా అభిమానులకు థాంక్స్ : తేజ్

by  |
మెగా అభిమానులకు థాంక్స్ : తేజ్
X

దిశ, వెబ్ డెస్క్ :

తన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసిన మెగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్. కరోనా లాంటి హార్డ్ సిచువేషన్స్‌లోనూ తన బర్త్ డే రోజున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఫ్యాన్స్‌కు థాంక్స్ చెప్పారు. చాలెంజింగ్ టైమ్స్ లో అభిమానులు చేసిన దాన ధర్మాలు విస్మయానికి, ఆనందానికి గురి చేశాయన్న తేజ్.. పుట్టినరోజు చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ రోజును మరింత గొప్పగా మార్చారని.. ఇది చిరస్మరణీయమైనదని అన్నారు.

కాగా ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన తేజ్.. దేవ కట్టా డైరెక్షన్‌లో చేస్తున్న తన 17వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కీలకపాత్రలో కనిపించబోతోందని సమాచారం.

Next Story

Most Viewed