"కన్నప్ప"కు మెగా హీరో సపోర్ట్!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-26 10:55:10  IST  )

మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా రేపు థియేటర్లలో విడుదల కానుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కించిన ఈ సినిమాలో విష్ణుతో పాటు ప్రభాస్ ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

కన్నప్పకు మెగా హీరో సపోర్ట్!
X

దిశ, వెబ్ డెస్క్: మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా రేపు థియేటర్లలో విడుదల కానుంది. భారీ అంచనాల నడుమ తెరకెక్కించిన ఈ సినిమాలో విష్ణుతో పాటు ప్రభాస్ ముఖ్యమైన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.దాదాపు ప్రభాస్ సినిమాలో గంటసేపు కనిపిస్తారని విష్ణు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక సినిమాలో ప్రభాస్ మాత్రమే కాకుండా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, హీరోయిన్ కాజల్ అగర్వాల్, మలయాళ స్టార్ మోహన్ లాల్ సైతం ప్రధాన పాత్రల్లో నటించారు.

వీరితో పాటు మంచు విష్ణు ఈ సినిమాతో తన ముగ్గురు పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఇక సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో పలువురు కన్నప్ప విజయం సాధించాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాహీరో సాయిధరమ్ తేజ్ సైతం కన్నప్ప సినిమాపై ఓ పోస్ట్ పెట్టారు. సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. విష్ణు అన్న విజన్‌ను చిత్రయూనిట్ అంతా నమ్మిందని, ఆడియన్స్ ప్రేమను ఈ చిత్రం పొందుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో మోహన్ బాబు తన మూడో జనరేషన్ నటనను చూస్తారని పేర్కొన్నారు.

Next Story