తేజ్ సినిమాను లాంచ్ చేసిన పవన్

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేవ కట్టా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎమోషనల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుండగా&#8230; జేబీ మూవీస్ పతాకంపై భగవాన్, పుల్లారావులు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ కాగా.. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన [&hellip;]</p>

తేజ్ సినిమాను లాంచ్ చేసిన పవన్
X

దిశ, వెబ్‌డెస్క్: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దేవ కట్టా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎమోషనల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతుండగా… జేబీ మూవీస్ పతాకంపై భగవాన్, పుల్లారావులు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నివేదా పేతురాజ్ హీరోయిన్ కాగా.. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన సాయిధరమ్ తేజ్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన పవన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. పవన్ మామ రాకతో సంతోషంతో మాటలు రావడం లేదన్న తేజ్…. మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరాడు. కాగా వరుస ఫెయిల్యూర్స్‌తో సినిమా కెరియర్ ముగుస్తుందనే టైంలో చిత్రలహరితో కాస్త తేరుకున్న తేజ్… ప్రతి రోజు పండగే సినిమాతో హిట్ కొట్టాడు. త్వరలో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

విభిన్నమైన కథలను తెరకెక్కించే డైరెక్టర్ దేవ కట్టా కాస్త వెనుకబడిపోయాడు. ఈ సినిమాతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టాలనే తపనతో ఉన్నాడు. అందుకే పొలిటికల్ డ్రామాకు మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి హిట్ కొట్టాలనే ప్లాన్‌లో ఉన్నాడు.

Tags: Sai Dharam Tej, Pawan Kalyan, Deva Katta, JB Movies, Tej Pawan

Next Story