- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సఫాయి సురక్షా అవగాహన కార్యక్రమం
<p>దిశ, ఎల్బీనగర్: సీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సపాయి సురక్షా ఛాలెంజ్‌లో భాగంగా సఫాయి మిత్ర సురక్ష అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగోల్‌లోని సుధీర్‌రెడ్డి కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో జలమండలి డైరెక్టర్ శ్రీధర్‌బాబు, సీజీఎం ప్రసన్న కుమార్, సీడ్ స్వచ్చంద సంస్థ సీఈఓ ఎస్. నాగబ్రహ్మచారి కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జలమండలి డైరెక్టర్ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. సెప్టిక్ ట్యాంకులు ఉపయోగించే కాలనీల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా వాటిని […]</p>

దిశ, ఎల్బీనగర్: సీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సపాయి సురక్షా ఛాలెంజ్‌లో భాగంగా సఫాయి మిత్ర సురక్ష అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగోల్‌లోని సుధీర్‌రెడ్డి కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో జలమండలి డైరెక్టర్ శ్రీధర్‌బాబు, సీజీఎం ప్రసన్న కుమార్, సీడ్ స్వచ్చంద సంస్థ సీఈఓ ఎస్. నాగబ్రహ్మచారి కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జలమండలి డైరెక్టర్ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. సెప్టిక్ ట్యాంకులు ఉపయోగించే కాలనీల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
క్రమం తప్పకుండా వాటిని శుభ్రం చేయించుకోవాలని సూచించారు. జలమండలిలో నమోదు చేసుకుంటే తక్కువ ఖర్చుతో శుభ్రం చేయించడం జరుగుతుందన్నారు. సఫాయి కార్మికుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైనేజీలు శుభ్రం చేసేటప్పుడు అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. జలమండలి టోల్ ఫ్రీ నంబర్ 155313 ఫోన్ చేస్తే తక్కువ ఖర్చుతో సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడం జరుగుతుందని తెలిపారు. దీనిని కాలనీవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఇండియా నరేష్, కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్‌యాదవ్, శంకర్‌యాదవ్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఎల్లయ్య, మహిళా సంఘం నాయకురాలు అనిత తదితరులు పాల్గొన్నారు.






