- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిసెంబర్‌లో సదరం శిబిరం
by Shyam |
<p>దిశ,సిద్దిపేట: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిద్దిపేట వారి అధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డిసెంబర్ 3,10,17,24, 31 తేదీల్లో సదరం శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ శిబిరానికి హాజరు కావాలనుకున్న వికలాంగులు తమ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్‌లో అన్ లైన్‌లో స్లాట్ బుక్ చేయించుకోవాలన్నారు. ఆ తర్వాత అభ్యర్థులు తమకు కేటాయించిన రోజున రశీదు, ఆధార్ కార్డు కాపీలతో కోమటి చెరువు దగ్గరలో గల జిల్లా జనరల్ ఆస్పత్రికి ఉదయం 9 గంటల […]</p>

X
దిశ,సిద్దిపేట: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సిద్దిపేట వారి అధ్వర్యంలో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డిసెంబర్ 3,10,17,24, 31 తేదీల్లో సదరం శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ శిబిరానికి హాజరు కావాలనుకున్న వికలాంగులు తమ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్‌లో అన్ లైన్‌లో స్లాట్ బుక్ చేయించుకోవాలన్నారు.
ఆ తర్వాత అభ్యర్థులు తమకు కేటాయించిన రోజున రశీదు, ఆధార్ కార్డు కాపీలతో కోమటి చెరువు దగ్గరలో గల జిల్లా జనరల్ ఆస్పత్రికి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1గంటల సమయంలో హాజరు కావాలని తెలిపారు. అన్ లైన్‌లో నమోదు కానీ వారు హాజరు కావాల్సిన అవసరం లేదని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. తమ వెంట మీ సేవ రిసిప్ట్, ఒక పోటో, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ, శారీరక వికలాంగులు వారు పూర్తిగా నిలబడిన పోటో తేవాలని సూచించారు.
Next Story






