సుశాంత్ హెలికాప్టర్ షాట్‌ చూసి సచిన్ కితాబు

by  |
సుశాంత్ హెలికాప్టర్ షాట్‌ చూసి సచిన్ కితాబు
X

దిశ, స్పోర్ట్స్: బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ‘ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ’. మాజీ కెప్టెన్ ధోనీ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా షూటింగ్‌కు ముందు సుశాంత్ మాజీ క్రికెటర్ కిరణ్ మోరే దగ్గర శిక్షణ పొందాడు. బీకేసీ బింద్రా స్టేడియంలో సుశాంత్ హెలీకాప్టర్ షాట్‌ను ప్రాక్టీస్ చేస్తుండగా అనుకోకుండా సచిన్ అక్కడికి వచ్చాడు. సుశాంత్‌ బ్యాటింగ్‌ను కాసేపు చూసిన తర్వాత.. ఎవరీ కుర్రాడు చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని కిరణ్ మోరేను అడిగాడట. ఆతను హీరో సుశాంత్‌.. ధోనీ బయోపిక్‌ కోసం సన్నద్ధమవుతున్నాడు అని చెప్పగానే ఆయన షాక్‌ అయ్యారు. ‘అతనికి ఆటపై ఆసక్తి ఉంటే ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడగల సత్తా ఉందని సచిన్‌ ప్రశంసించారు’ అని మోరే తెలిపారు. ఇక మహీ మేనేజర్ అరుణ్ పాండే కూడా సుశాంత్ గురించి చెప్పాడు. సుశాంత్ హెలీకాప్టర్ షాట్ చూసి అచ్చం నాలాగే ఆడావు. నువ్వు రంజీ క్రికెట్ కూడా ఆడగలవని ధోనీ ప్రశంసించాడట.

Next Story