హైకమాండ్‌పై సచిన్ పైలట్ ట్వీట్

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-14 05:09:19  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాజకీయాలు ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతున్నాయి. పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించి, సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం సహా ఇతర అన్ని పదవుల నుంచి కాంగ్రెస్ హైకమాండ్ తొలగించింది. ఇది జరిగిన వెంటనే సచిన్ పైలట్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘సత్యాన్ని వక్రీకరించగలరేమో కానీ.. దాన్ని ఓడించలేరు’ అని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఇదే సరైనా అవకాశంగా భావించిన బీజేపీ వెంటనే సచిన్‌కు ఆహ్వానం అందించే అవకాశాలు [&hellip;]</p>

హైకమాండ్‌పై సచిన్ పైలట్ ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్ రాజకీయాలు ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతున్నాయి. పార్టీ అధిష్ఠానాన్ని ధిక్కరించి, సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్‌ను డిప్యూటీ సీఎం సహా ఇతర అన్ని పదవుల నుంచి కాంగ్రెస్ హైకమాండ్ తొలగించింది. ఇది జరిగిన వెంటనే సచిన్ పైలట్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘సత్యాన్ని వక్రీకరించగలరేమో కానీ.. దాన్ని ఓడించలేరు’ అని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఇదే సరైనా అవకాశంగా భావించిన బీజేపీ వెంటనే సచిన్‌కు ఆహ్వానం అందించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సాయంత్రంలోపు తన భవిష్యత్ కార్యాచరణపై ఆయన స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది. మరోవైపు పీసీసీ పదవి నుంచి సచిన్‌ను తొలగించిన వెంటనే ఆయన స్థానంలో గోవింద్ సింగ్ దోతస్త్రాను నియమించారు.

Next Story