సచిన్ రూ. 50 లక్షల సాయం

by Shamantha N |

<p>కరోనాపై పోరాటానికి క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండుల్కర్ 50 లక్షల రూపాయల సాయం ప్రకటించాడు. కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేసింది. మరోవైపు రాష్ట్రాలు క్వారంటైన్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నాయి. దీనికి అయ్యే ఖర్చును దాతల నుంచి విరాళాల రూపంలో సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సచిన్ తన వంతు సాయంగా ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ [&hellip;]</p>

సచిన్ రూ. 50 లక్షల సాయం
X

కరోనాపై పోరాటానికి క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండుల్కర్ 50 లక్షల రూపాయల సాయం ప్రకటించాడు. కరోనా ముప్పును ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించడంతో పాటు ప్రజలను అప్రమత్తం చేసింది. మరోవైపు రాష్ట్రాలు క్వారంటైన్ సెంటర్లు, ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నాయి. దీనికి అయ్యే ఖర్చును దాతల నుంచి విరాళాల రూపంలో సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సచిన్ తన వంతు సాయంగా ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షలు విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు.

Tags : Sachin, Corona, Lock down, Donation, CMRF

Next Story