- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంటైన్‌మెంట్ ఏరియాలపై ప్రత్యేక నిఘా
<p>దిశ, రంగారెడ్డి: ప్రభుత్వం ప్రకటించిన కంటైన్‌మెంట్ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కరోనా నివారణపై జల్పల్లి మున్సిపాలిటీలోని అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంటైన్‌మెంట్ ప్రకటించిన ప్రాంతాల ప్రజలు అడుగు బయట పెట్టొద్దనిని తెలిపారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను అధికారులు […]</p>

X
దిశ, రంగారెడ్డి: ప్రభుత్వం ప్రకటించిన కంటైన్‌మెంట్ ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కరోనా నివారణపై జల్పల్లి మున్సిపాలిటీలోని అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కంటైన్‌మెంట్ ప్రకటించిన ప్రాంతాల ప్రజలు అడుగు బయట పెట్టొద్దనిని తెలిపారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను అధికారులు అందుబాటులో ఉంచుతారని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
tag: sabitha indra reddy, review, Containment Areas, rangareddy
Next Story






