‘సాహో’నే టాప్..

by  |
‘సాహో’నే టాప్..
X

ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్. బాహుబలి సినిమా చూసి దేశం మొత్తం ప్రభాస్ కటౌట్‌కు పడిపోగా.. ఆ తర్వాత వచ్చిన సాహో సినిమాకు కూడా నీరాజనాలు పట్టారు. అయితే, తెలుగులో సాహోకు మిశ్రమ ఫలితాలు వచ్చినా.. హిందీలో మాత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిసింది. అంటే టాలీవుడ్‌లో సినిమా సంగతి ఎలా ఉన్నా.. బాలీవుడ్‌లో సాహో సూపర్ డూపర్ హిట్ అయిందన్నమాట. అంతేకాదు నెట్ ఫ్లిక్స్, అమెజాన్‌లో స్ట్రీమ్ అయిన సాహో హిందీ వెర్షనే తెగ చూసేశారు.

జనవరి26న జీ సినిమా ఛానెల్‌లో ప్రసారమైన ‘సాహో’కు రేటింగ్స్ గట్టిగానే వచ్చాయి. నెట్ ఫ్లిక్స్, అమెజాన్‌లో ప్రసారం అయిన తర్వాత కూడా ఛానెల్‌లో వచ్చిన సినిమాకు ఇంత రేటింగ్ రావడం నిజంగా అరుదు. జనవరి నాల్గో వారంలో సినిమా ప్రసారం కాగా రేటింగ్‌లో సాహో ఫస్ట్ ప్లేస్‌లో ఉందట. సహజంగా ఇలాంటి రేటింగ్ బాలీవుడ్ సూపర్ స్టార్స్ సినిమాలకు మాత్రమే వస్తుండగా.. ఆ లిస్ట్‌లో డార్లింగ్ ప్రభాస్ చేరిపోయాడు. బాలీవుడ్‌ హీరోలకు సరైన పోటీ ఇస్తున్నాడు. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన సాహో మూవీ పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కాగా..శ్రద్ధ కపూర్ కథానాయిక. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ మూవీని నిర్మించింది.

Next Story

Most Viewed