- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్తగా 2.22 లక్షల మందికి రైతు బంధు !
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రైతులకు పెట్టుబడి కింద ఆర్థిక సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు సాయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రైతు బంధు సాయం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. గత యాసంగిలో 59.33 లక్షల మంది రైతు బంధు సాయం పొందారన్నారు. అలాగే ఈ సారి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రైతులకు పెట్టుబడి కింద ఆర్థిక సాయం అందించేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు సాయానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే రైతు బంధు సాయం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. గత యాసంగిలో 59.33 లక్షల మంది రైతు బంధు సాయం పొందారన్నారు. అలాగే ఈ సారి కొత్తగా 2.22 లక్షల మంది కొత్తగా చేరినందున ఈ సీజన్‌లో మొత్తం రైతు బంధు సాయం పొందే వారు 61.55 లక్షల మంది రైతులు ఉంటారని అంచనా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. రైతుబంధు పథకానికి కొత్తగా అర్హులైన రైతుల సంఖ్య 2.22 లక్షల రైతులు రెవెన్యూ రికార్డుల్లో భూమి ఖాతాల ప్రకారం పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ విభాగంలోకి మారిన వారని రెవెన్యూశాఖ తెలిపింది.
Next Story






