డేవీస్ కప్ సెమీ ఫైనల్‌లోకి రష్యా..

by  |
డేవీస్ కప్ సెమీ ఫైనల్‌లోకి రష్యా..
X

దిశ, స్పోర్ట్స్ : డానియల్ మెద్వెదేవ్ డేవీస్ కప్‌లో తన అద్భుతమైన రికార్డును కొనసాగిస్తున్నాడు. స్వీడన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో మెద్వెదేవ్ 6-4, 6-4 తేడాతో మికాయిల్ యెమెర్‌పై విజయం సాధించాడు. పురుషుల సింగిల్స్ రెండో ర్యాంకర్ డానిల్ మెద్వెదేవ్ డేవీస్ కప్‌లో వరుసగా మూడో మ్యాచ్ గెలిచాడు. గ్రూప్ స్టేజిలో స్పెయిన్‌కు చెందిన పాబ్లో బుస్టా, ఈక్వెడార్‌కకు చెందిన ఎమిలో గోమెజ్‌ను ఓడించాడు.

ఇక ఆఖరి మ్యాచ్‌లో మికాయిల్‌ను మట్టి కరిపించాడు. దీంతో పాటు క్వార్టర్ ఫైనల్‌ మరో మ్యాచ్‌లో కూడా రష్యా గెలుపొందింది. క్వార్టర్స్‌లోని రెండు సింగిల్స్ మ్యాచ్‌లలో కూడా రష్యా గెలుపొందడంతో డబుల్స్ మ్యాచ్ అవసరం లేకుండానే రష్యా సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. శనివారం జరుగున్న సెమీస్‌లో రష్యా టెన్నిస్ జట్టు జర్మనీతతో తలపడనున్నది. అలాగే మరో సెమీస్‌లో నోవాక్ జకోవిచ్ నేతృత్వంలోని సెర్బియా జట్టు క్రొయేషియాతో తలపడుతుంది.

Next Story

Most Viewed