- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూపాయి రికార్డు పతనం.. తొలిసారి 92.50 మార్కు దాటిన భారత కరెన్సీ
భారత రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రికార్డు స్థాయికి పడిపోయింది. తొలిసారిగా 92.50 మార్కును దాటింది.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్‌లో భారత కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇవాళ ట్రేడింగ్‌లో రూపాయి విలువ తొలిసారిగా 92.50 మార్కును దాటి, ఇంట్రాడేలో 92.57 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని నమోదు చేసింది. గత కొన్ని సెషన్లుగా ఒత్తిడికి లోనవుతున్న రూపాయి, నేడు ట్రేడింగ్ ప్రారంభం నుంచే బలహీనంగా కొనసాగింది. ఒకానొక దశలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 92.57కి పడిపోయి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ ఇండెక్స్ బలపడటం, ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడం ఈ పతనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
పెరగనున్న నిత్యావసర ధరలు..
రూపాయి బలహీనపడటం వల్ల దేశంలో చమురు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పప్పు ధాన్యాల దిగుమతి వ్యయం పెరుగనుంది. దీంతో ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడనుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థుల ఫీజులు, ప్రయాణ ఖర్చుల విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.






