మంత్రగత్తె తిరుగుతోంది తస్మాత్ జాగ్రత్త..

by Batti.Sumithra |   (  Updated:2021-12-27 03:06:04  IST  )

<p>దిశ, కేసముద్రం: మహాబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో సోమవారం మంత్రగత్తె వదంతు ప్రజల్లో భయాందోళనలు కలిగించింది. పద్నాలుగు తీర్లు కొయ్య మంత్రాలు నేర్చుకున్న ఓ మహిళ తిరుగుతోందని కరపత్రాలు ప్రత్యక్షమయ్యాయి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు చల్లడంతో ఆ వార్త చుట్టుపక్కల గ్రామాల్లో హల్ చల్ చేసింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మూఢనమ్మకాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టి అదే గ్రామానికి చెందిన [&hellip;]</p>

మంత్రగత్తె తిరుగుతోంది తస్మాత్ జాగ్రత్త..
X

దిశ, కేసముద్రం: మహాబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో సోమవారం మంత్రగత్తె వదంతు ప్రజల్లో భయాందోళనలు కలిగించింది. పద్నాలుగు తీర్లు కొయ్య మంత్రాలు నేర్చుకున్న ఓ మహిళ తిరుగుతోందని కరపత్రాలు ప్రత్యక్షమయ్యాయి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు చల్లడంతో ఆ వార్త చుట్టుపక్కల గ్రామాల్లో హల్ చల్ చేసింది.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మూఢనమ్మకాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టి అదే గ్రామానికి చెందిన ఇద్దరి యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాట్రపల్లి గ్రామంలోని ప్రజలలో మూఢ నమ్మకాలను పోగొట్టేందుకు పోలీసులు అవగాహనా కార్యక్రమాలు చేయనున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.

Next Story