ఆ హీరోయిన్ చేతిలో మోసపోయిన 'హరిహర వీరమల్లు'..?

by  |
harihara veeramallu news
X

దిశ, వెబ్‌డెస్క్: ‘వకీల్ సాబ్’ చిత్రం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 45 శాతానికి పైగా పూర్తికాగా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో పవన్ సరసన బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండస్, ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ పాత్రకు సంబంధించి ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నిధి వీరమల్లును మోసగించే పాత్రలో కనిపించనుందట. స్ట్రాంగ్ అండ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్ర సినిమాను కీలక మలుపు తిప్పనుందట. ఇక ఈ సినిమా కోసం నిధి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది, ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో నటించిన అమ్మడు మొదటిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన స్ట్రాంగ్ పాత్రలో కనిపించనుంది. మరి ఈ సినిమాతో నిధి హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ల సరసన చేరుతుందేమో చూడాలి.

Next Story

Most Viewed