- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా కుటుంబాలు ఆగమవుతున్నాయ్.. వేతనాలు ఎప్పుడిస్తరు..?
by Shyam |
<p>దిశ, భూపాలపల్లి : వేతనాలు రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నెల 14 తేది వచ్చినప్పటికీ ఇంతవరకు వేతనాలు రాలేదు. దీంతో ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మంగళవారం ఉదయం భూపాలపల్లి ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. నెలలో సగం రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆందోళన తెలిపారు. తమ పిల్లల చదువులకు ఫీజులు ఎలా చెల్లించాలని […]</p>

X
దిశ, భూపాలపల్లి : వేతనాలు రాకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నెల 14 తేది వచ్చినప్పటికీ ఇంతవరకు వేతనాలు రాలేదు. దీంతో ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మంగళవారం ఉదయం భూపాలపల్లి ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. నెలలో సగం రోజులు గడిచినప్పటికీ ఇంతవరకు జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆందోళన తెలిపారు.
తమ పిల్లల చదువులకు ఫీజులు ఎలా చెల్లించాలని వాపోయారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ 5వ తేదీలోగా వేతనాలు అందుతుండగా తమ పట్ల ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు వేతనాలు సకాలంలో అందేలా చూడాలని కార్మికులు కోరుతున్నారు.
- Tags
- bhoopalapalli
Next Story






