- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోసం చేస్తే ప్రాణం పోయింది
<p>దిశ, వెబ్‌డెస్క్: మోసం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. అధికారం అడ్డు పెట్టుకొని వేధింపులు చేసినందుకు ఓ అమాయకుడు బలైయ్యాడు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళగిరి ఆర్టీసీ డిపోలో బల్లయ్య విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి కొద్దిగా పొలం ఉంది. అయితే, ఓ ఇంటెలిజెన్స్ సీఐ బల్లయ్య వద్ద ఆ పొలం కొనుగోలు చేశాడు. కానీ, కొద్దిగా డబ్బులు చెల్లించి మిగతావి వాయిదాలో చెల్లిస్తానంటూ అగ్రిమెంట్ రాయించుకున్నాడు. సీఐ పై […]</p>

దిశ, వెబ్‌డెస్క్: మోసం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. అధికారం అడ్డు పెట్టుకొని వేధింపులు చేసినందుకు ఓ అమాయకుడు బలైయ్యాడు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంగళగిరి ఆర్టీసీ డిపోలో బల్లయ్య విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడికి కొద్దిగా పొలం ఉంది. అయితే, ఓ ఇంటెలిజెన్స్ సీఐ బల్లయ్య వద్ద ఆ పొలం కొనుగోలు చేశాడు. కానీ, కొద్దిగా డబ్బులు చెల్లించి మిగతావి వాయిదాలో చెల్లిస్తానంటూ అగ్రిమెంట్ రాయించుకున్నాడు. సీఐ పై నమ్మకంతో బల్లయ్య దీనికి ఒప్పుకున్నాడు. ఇదే పొలం పేపర్లను చూయించి సీఐ పుత్రజయ హుటల్స్ పేరుతో రూ. 3 కోట్ల లోన్ తీసుకున్నాడు.
కానీ, మిగతా డబ్బులు మాత్రం చెల్లించకుండా బల్లయ్యను సీఐ ముప్పుతిప్పలు పెట్టాడు. అధికారం అడ్డుకుని బెదిరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ వేధింపులు తాళలేక బల్లయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బలయ్య చావుకు కారణమైన ఇంటెలిజెన్స్ సీఐ పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.






