బస్సు డిపో ముందు ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..

by Batti.Sumithra |   (  Updated:2021-08-28 07:40:42  IST  )

<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : డ్యూటీలు ఇవ్వడం లేదంటూ మనస్తాపానికి గురై ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బాన్సువాడ పట్ణణ కేంద్రంలో ఆర్టీసీ డిపో ఎదుట శనివారం చోటు చేసుకుంది. ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న సిబ్బంది, బాధితుడి కథనం ప్రకారం.. డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న బలరాం గత ఆదివారం విధులు నిర్వహించి, రెండు రోజుల పాటు విశ్రాంతిలో ఉన్నాడు. తిరిగి ఆయనకు ఆర్టీసీ అధికారులు బుధవారం డ్యూటీ వేయాల్సి ఉంది. కానీ శనివారం [&hellip;]</p>

బస్సు డిపో ముందు ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : డ్యూటీలు ఇవ్వడం లేదంటూ మనస్తాపానికి గురై ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బాన్సువాడ పట్ణణ కేంద్రంలో ఆర్టీసీ డిపో ఎదుట శనివారం చోటు చేసుకుంది. ఆర్టీసీ డిపోలో పని చేస్తున్న సిబ్బంది, బాధితుడి కథనం ప్రకారం.. డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న బలరాం గత ఆదివారం విధులు నిర్వహించి, రెండు రోజుల పాటు విశ్రాంతిలో ఉన్నాడు. తిరిగి ఆయనకు ఆర్టీసీ అధికారులు బుధవారం డ్యూటీ వేయాల్సి ఉంది. కానీ శనివారం వరకు నాలుగు రోజులు గడిచినా డ్యూటీ వేయకపోవడంతో మనస్తాపానికి గురై శనివారం సాయంత్రం ఆర్టీసీ డిపో ఎదుట డ్రైవర్ బలరాం పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు.

గమనించిన తోటి సిబ్బంది బలరాంను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా డివిజన్ స్థాయి అధికారులు డ్రైవర్లకు, కండక్టర్లకు డ్యూటీలు వేయడంలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు డ్రైవర్లు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. జిల్లా స్థాయి ఆర్టీసీ అధికారులు డివిజన్ స్థాయి అధికారులు సైతం కేవలం ఒక వర్గానికి చెందిన వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పిస్తూ డ్యూటీలు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

గతంలో యూనియన్‌ ఉండేదని, డ్రైవర్లు, కండక్టర్లు ఏ సమస్యలున్నా యూనియన్ సంఘం సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసేవారని అన్నారు. ప్రస్తుతం యూనియన్ లు రద్దు చేయడంతో అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారంటూ పలువురు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి సిబ్బందికి న్యాయం చేయాలని బాన్సువాడ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు డిమాండ్ చేశారు.

Next Story