దేశవాళీ క్రికెటర్లకు రూ. 50 కోట్ల పరిహారం

by  |
దేశవాళీ క్రికెటర్లకు రూ. 50 కోట్ల పరిహారం
X

దిశ, స్పోర్ట్స్: కరోనా కారణంగా గత సీజన్ రంజీ క్రికెట్ రద్దయ్యింది. దీంతో దాదాపు 700 మంది దేశవాళీ క్రికెటర్లకు రావల్సిన మ్యాచ్ ఫీజులు, కాంట్రాక్టు వేతనాలు రాకుండా పోయింది. వీరిలో చాలా మంది కేవలం క్రికెట్ మాత్రమే ఉపాధిగా కలిగి ఉన్నారు. గత ఏడాది బీసీసీఐ నుంచి వేతనాలు అందకపోవడంతో వాళ్లు నానా ఇబ్బందులు పడుతుతున్నారు. మ్యాచ్‌లు జరగనందున వారికి ఫీజులు చెల్లించలేక పోయినట్లు బీసీసీఐ చెప్పింది. అయితే కనీసం ఆయా ఆటగాళ్లకు కనీసం పరిహారం అయినా అందజేయాలని విజ్ఞప్తులు వచ్చాయి.

శనివారం జరిగిన బీసీసీఐ సమావేశంలో దీనిపై చర్చిస్తారని భావించినా అది జరగలేదు. అయితే దేశవాళీ క్రికెటర్లకు రూ. 50 కోట్ల పరిహారం అందించాలని బీసీసీఐ భావిస్తున్నది. గత ఏడాది తీసుకున్న నిర్ణయానికే బీసీసీఐ కట్టుబడి ఉంటుందని అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా స్పష్టం చేశారు. పురుష క్రికెటర్లకు రూ. 4.5 లక్షలు, మహిళా క్రికెటర్లకు రూ. 2.5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలుస్తున్నది. దీనికి బీసీసీఐ రూ. 50 కోట్లు ఖర్చు చేయనున్నది. భారీ నిధులు, ఆదాయం ఉన్న బీసీసీఐకి రూ. 50 కోట్లు పెద్ద భారం కాదని కూడా భావిస్తున్నారు.


Next Story

Most Viewed