నకిలీ చలాన్ల స్కాంలో రూ.3.39 కోట్లు రికవరీ: డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్

by  |
నకిలీ చలాన్ల స్కాంలో రూ.3.39 కోట్లు రికవరీ: డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
X

దిశ, ఏపీ బ్యూరో : రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో ఎలాంటి స్కాంలకు ఆస్కారం లేకుండా కొత్త సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. కొత్త సాఫ్ట్‌వేర్ సహాయంతోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని వెల్లడించారు. నకిలీ చలానాల కుంభకోణంపై ఆ శాఖ ఐజి శేషగిరి బాబుతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అదనపు ఐజి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి కుంభకోణానికి సంబంధించి వివరాలు సేకరించినట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలో 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ అవినీతి జరిగిందన్నారు. మొత్తం రూ.7,13,76,148 కోట్ల కుంభకోణం జరిగిందని..దీంట్లో రూ.3,38,11,190 రికవరీ చేసినట్లు తెలిపారు. అలాగే సంబంధిత శాఖల అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోగా ప్రమేయం ఉన్న ప్రైవేటు వ్యక్తులపై క్రిమినల్ చర్యలకు ఆదేశాలు జారీ చేశామని వివరించారు. బోగస్ చలానాల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లపై ఏం చేయాలనే దానిపై న్యాయ సలహా కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో రిజిస్ట్రేషన్ల సేవలు మరింత సులభతరం చేసేందుకు కృషి చేస్తున్నామని డిప్యూటీ సీఎం కృష్ణదాస్ పేర్కొన్నారు.


Next Story