- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.2.72 లక్షల తంబాకు సీజ్
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: జిల్లాలోని బోథ్ మండలం ఘన్‌పూర్ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న నిషేధిత తంబాకును పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.72 లక్షలు ఉంటుంది. మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్ నుంచి యథేచ్ఛగా నిషేధిత తంబాకు, గుట్కా సరఫరా కొనసాగుతూనే ఉంది. చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం విధులు నిర్వహిస్తున్న పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా..మాక్స్ పికప్ వాహనంలో పేలాల సంచుల మాటున నిషేధిత సూర్య చాప్ 34.5 కార్టూన్ల తంబాకును గుర్తించారు. వెంటనే డ్రైవర్‌ను […]</p>

X
దిశ, ఆదిలాబాద్: జిల్లాలోని బోథ్ మండలం ఘన్‌పూర్ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న నిషేధిత తంబాకును పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2.72 లక్షలు ఉంటుంది. మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్ నుంచి యథేచ్ఛగా నిషేధిత తంబాకు, గుట్కా సరఫరా కొనసాగుతూనే ఉంది. చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం విధులు నిర్వహిస్తున్న పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా..మాక్స్ పికప్ వాహనంలో పేలాల సంచుల మాటున నిషేధిత సూర్య చాప్ 34.5 కార్టూన్ల తంబాకును గుర్తించారు. వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా హిమాయత్ నగర్ నుంచి ఇచ్చోడకు తరలిస్తున్నామని తెలిపారు. వాహనాన్ని సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోథ్ ఎస్ఐ రాజు తెలిపారు.
Next Story






