చంద్రుడిపై సైంటిస్టు కామ క్రీడలు.. బెడ్ పై వాటిని పరిచి ప్రియురాలితో

979

దిశ, వెబ్‌డెస్క్: పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు పెద్దలు. ఎప్పుడు ఎవరి బుద్ది ఎలా మారుతుందో ఎవరం చెప్పలేము. చిత్రవిచిత్రమైన కోరికలు మైండ్ లో మెదులుతూ కొంతమందిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆ కోరికలను తీర్చుకోకపోతే వారి ప్రాణం పోతుందేమో అనేంతలా ఫీల్ అవుతారు. అందుకోసం దేనికి వెనుకాడరు. తాజాగా ఒక సైంటిస్టు కి వచ్చిన ఒక వింత కోరిక, దాని కోసం అతను చేసిన పాడుపని నాసా సంస్థకు రూ.158 కోట్ల భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇంతకు అతగాడు చేసిన ఆ పాడుపని ఏంటి..? అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది అంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. దాదాపు పందొమ్మిదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అమెరికాకు చెందిన థాడ్ రాబర్ట్స్ అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి సైంటిస్టు కావాలని కోరిక. అందుకోసం రాత్రింబవళ్లు కష్టపడి చదివాడు. చంద్రమండలం మీద కాలు మోపి.. అక్కడ ప్రయోగాలు చేయాలని అతడి చిరకాల వాంఛ. ఎట్టకేలకు తన పట్టుదలతో నాసా లూనార్ ల్యాబ్ లో ట్రైనింగ్ పొందే అవకాశం దక్కించుకున్నాడు. అక్కడ వ్యోమగామిగా శిక్షణ తీసుకోవడానికి రెడీ అయ్యాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇతడికున్న బలహీనతల్లో ముఖ్యమైనది సెక్స్. ఆ బలహీనతే అతనిని అధఃపాతాళానికి నెట్టేసింది. ఇతగాడికి మొదటి నుంచి సెక్స్ కోరికలు ఎక్కువ.. వింత వింత ప్రదేశాల్లో శృంగారం చేయాలన్న ఆలోచనతో చంద్రమండలంపై సెక్స్ చేయాలనే వింత కోరిక పుట్టింది. దీనికి నాసా ఒప్పుకోదని తెలిసి ఒక దరిద్రపు ప్లాన్ వేశాడు.

అప్పట్లో నాసా చంద్రమండలం నుంచి తెచ్చిన 101 గ్రాముల రాళ్లు.. కొంత మట్టిని తెచ్చింది. ఇక సెక్స్ చేయాలనే కోరికతో థాడ్ రాబర్ట్స్ వాటిని దొంగలించి.. పరుపు మీద వాటిని  పరిచి తన గర్ల్ ఫ్రెండ్ తో శృంగారం చేయాలని ఆలోచించాడు. ఇదే విషయాన్ని తనతో పాటే పనిచేసే తన గర్ల్ ఫ్రెండ్ కి కూడా చెప్పడం, ఆమె కూడా ఓకే అనడంతో ఇతగాడు చంద్రమండలం నుంచి తెచ్చిన 101 గ్రాముల రాళ్లను , మట్టిని దొంగలించి.. ఒక హోటల్ రూమ్ లో తన బెడ్ పై వాటిని పరిచి చంద్రమండలంపైనే శృంగారం చేస్తున్నట్లు ప్రియురాలితో రొమాన్స్ కానిచ్చేశాడు.

సరే తర్వాతైనా వాటిని యథాస్థానంలో పెట్టకుండా దుర్బుద్ధితో ఆలోచించి  గ్రాము చంద్రుడి మట్టిని రూ.3.7లక్షల చొప్పున అమ్మేందుకు బెల్జియంకు చెందిన సైంటిస్టుతో ఒప్పందం చేసుకున్నాడు. మళ్లీ అందులోనూ మొత్తం ఇచ్చేస్తే త్వరగా అయిపోతుందని, మట్టిని సైతం కల్తీ చేసి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి కోటీశ్వరుడిగా మారాడు. ఇక ఇతగాడు చేసిన నిర్వాకం వలన నాసాకు రూ.158 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ఇక దీనిపై విచారణ చేపట్టిన ఎఫ్ బీ అధికారులు ఇతడి గుట్టురట్టు చేస్తూ.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర ఉన్న చంద్రుడి ధూళిని స్వాధీనం చేసుకున్నారు. అతడికి కోర్టు  జైలు శిక్షను విధించింది. అతి కోరికలతో రగిలిపోయి ఇప్పుడు జైల్లో ఉచలు లెక్కిస్తున్నాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..