- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూ.లక్ష విలువైన మద్యం పట్టివేత
by Batti.Sumithra |
<p>దిశ, నిజామాబాద్: జిల్లా కేంద్రం నుంచి వర్ని మండలానికి తరలిస్తున్న రూ.లక్ష విలువైన మద్యాన్ని నవిపేట్ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ శివారులో వాహనాల తనిఖీలు చేపట్టి, లక్ష రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని, తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. అలాగే, డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. కాగా, లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూసివేయడంతో బ్లాక్ మార్కెట్‌లో మద్యానికి డిమాండ్ పెరిగింది. ఈ […]</p>

X
దిశ, నిజామాబాద్: జిల్లా కేంద్రం నుంచి వర్ని మండలానికి తరలిస్తున్న రూ.లక్ష విలువైన మద్యాన్ని నవిపేట్ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ శివారులో వాహనాల తనిఖీలు చేపట్టి, లక్ష రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకుని, తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. అలాగే, డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. కాగా, లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూసివేయడంతో బ్లాక్ మార్కెట్‌లో మద్యానికి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ పట్టణం నుంచి వర్ని మండలంలోని శ్రీనగర్‌కు మద్యాన్ని తరలించేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు.
Tags: liquor, seized, nizamabad, crime news, ts
Next Story






