- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాపై పోరుకు రూ.1.11 కోట్ల విరాళం
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: కరోనా మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం అందించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళాలు ఇచ్చారు. మొత్తంగా రూ.1.11 కోట్ల చెక్కులను శుక్రవారం ప్రగతిభవన్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా సీఎం కేసీఆర్‌కు అందజేశారు. కరోనాపై పోరులో రాష్ర్ట ప్రభుత్వానికి బాసటగా నిలిచిన దాతలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. […]</p>

X
దిశ, ఆదిలాబాద్: కరోనా మహమ్మారిపై పోరాటానికి తమ వంతు సాయం అందించేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు సీఎం రిలీఫ్ ఫండ్‌కు భారీ విరాళాలు ఇచ్చారు. మొత్తంగా రూ.1.11 కోట్ల చెక్కులను శుక్రవారం ప్రగతిభవన్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా సీఎం కేసీఆర్‌కు అందజేశారు. కరోనాపై పోరులో రాష్ర్ట ప్రభుత్వానికి బాసటగా నిలిచిన దాతలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ నల్లా వెంకట్రామ్ రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ నాయకులు రాంకిషన్ రెడ్డి, డాక్టర్ సుభాష్ రావు ఉన్నారు.
Next Story






