లైకా ప్రొడక్షన్స్ గుప్పిట్లో ‘ఆర్ఆర్ఆర్’ తమిళ్ రైట్స్

by  |
లైకా ప్రొడక్షన్స్ గుప్పిట్లో ‘ఆర్ఆర్ఆర్’ తమిళ్ రైట్స్
X

దిశ, సినిమా : ఇండియాస్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ కాబోతుంది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో చరణ్, తారక్ అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌గా నటిస్తుండగా.. ఈ చిత్రం గురించి మరో అప్‌డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. ‘ఆర్ఆర్ఆర్’ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ను లైకా ప్రొడక్షన్స్ నిర్మాణసంస్థ దక్కించుకున్నట్లు తెలుపుతూ ట్వీట్ చేసింది. ఈ మేరకు ది బిగ్గెస్ట్ ఫిల్మ్‌ను బిగ్గెస్ట్ వేలో రిలీజ్ చేసేందుకు వెయిట్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. కాగా బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, ఆలియా భట్ కూడా ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ‘బాహుబలి 2’ను మించిన థియేట్రికల్ బిజినెస్‌తో రికార్డులు సృష్టించడం ఖాయం అంటున్నారు నిపుణులు. విడుదలకు ముందే రూ. 500 కోట్ల బిజినెస్ చేసిందనే టాక్ వినిపిస్తుండగా, బాహుబలి రికార్డులను బ్రేక్ చేసేందుకు విట్‌నెస్‌గా నిలుద్దామంటున్నారు మేకర్స్.

https://twitter.com/DVVMovies/status/1361986249964195846?s=20


Next Story

Most Viewed