'ఆర్ఆర్ఆర్' తో పవన్ కు ఉన్న సంబంధమేంటి..?

by  |
rrr poster vs pawan kalyan old photos
X

దిశ, వెబ్‌డెస్క్: ఫిక్షనల్ ఫిరియాడికల్ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ మీదే అందరి దృష్టి ఉందన్న మాట అతిశయోక్తి కాదు. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటునాలు తెలిపిన మేకర్స్ నిన్ననే ఒక కొత్త పోస్టర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒకే బైక్ పై అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ గెటప్పులో స్టార్ హీరోలు నవ్వులు చిందిస్తున్న ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టర్ ని నెటిజన్లు తమకిష్టమైన హీరోలను కలుపుతూ ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఈ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గరనుంచి పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగిపోతుంది. ఇంతకీ ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధం ఏంటి..? అంటే.. ‘ఆర్ఆర్ఆర్’ బైక్ కు పవన్ కళ్యాణ్ కు లింక్ చేస్తూ ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

“నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తాను” అని ‘గబ్బర్ సింగ్’ లో పవన్ డైలాగ్ చెప్పినట్లే ఈ బైక్ విషయంలోనూ పవన్ ట్రెండ్ సెట్ చేశాడని పవన్ అభిమానులు కోడై కూస్తున్నారు. చరణ్, ఎన్టీఆర్ వెళ్తున్న ఆ బైక్ ఆల్రెడీ పవన్ వాడేసిందంట. పవన్ కళ్యాణ్ ‘జల్సా’ సినిమాలో అదే బైక్ పై కూర్చొని ఉన్న ఒక ఫోటోను వెతికి పట్టుకొని, ‘ఆర్ఆర్ఆర్’ పోస్టర్ పక్కన పెట్టి జతచేసి పవన్ ట్రెండ్ సెట్టర్ అంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇక ఫొటోలో బైక్ లను గమనిస్తే రెండూ ఒకేలా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ‘ఆర్ఆర్ఆర్’ కు పవన్ కు లింక్ అయ్యిందని అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా పవన్ ట్రెండ్ సెట్ చేసేవాడే కానీ ఫాలో అయ్యేవాడు కాదని మరోసారి రుజువయ్యింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ‘అయ్యప్పన్ కోషియం’ రీమేక్ లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెల్సిందే.

Next Story