ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్: RRR నుంచి మరో సర్‌ప్రైజ్

by  |
RRR
X

దిశ, వెబ్‌డెస్క్: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఒక కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్స్, గ్లింప్స్ అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అంతేగాకుండా.. ఈ చిత్రం నుంచి ఫ్రెండ్షిప్ డే రోజున విడుదలైన మొదటిసాంగ్ ‘దోస్తీ’ కూడా సినీ ప్రేక్షకులను ఆకర్షించింది. తాజాగా.. ఈ చిత్రం నుంచి రెండో సాంగ్‌ను నవంబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ఫ్యాన్స్ దిపావళి గిఫ్ట్ కింద ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్ చేస్తున్న ఈ ఫొటో ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తోంది. ఇక వచ్చే ఏడాది జనవరి 7న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ను ఇప్పటికే చిత్రయూనిట్ స్టార్ట్ చేసింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. కాగా, ఈ చిత్రానికి ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

https://twitter.com/RRRMovie/status/1456647011491475458?s=20


Next Story

Most Viewed