‘ఆర్ఆర్ఆర్’ నుంచి మరో సాంగ్ రిలీజ్.. వింటే గుస్‌బమ్స్ రావడం ఖాయం..

by  |
RRR
X

దిశ, సినిమా: టాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ నుంచి తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా ఇంతకు ముందు ‘నాటు నాటు దోస్తీ’ గీతం అభిమానులను అమితంగా ఆకట్టుకోగా.. తాజాగా ‘జననీ ప్రియ భారత జననీ’ పాటను రిలీజ్ చేశారు. ఇక ఈ పాట పూర్తిగా దేశభక్తిని చాటే విధంగా ఉండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ పాటను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ పోస్ట్ చేయగా జననీ ప్రియ భారత సాంగ్ ఈ సినిమాకు ఆత్మలాంటిదని రాజమౌళి తెలపడం విశేషం.

ఈ సందర్భంగా పాట గురించి వివరించిన రాజమౌళి.. ‘ఈ పాటకోసం మా పెద్దన్న కీరవాణి రెండు నెలలు కష్టపడ్డారు. పాటకు లిరిక్స్ కూడా ఆయనే రాశారు. పాటలో కనిపించని భావోద్వేగాలుంటాయి. ఒక మణిహారంలో ఉన్న దారం ఎలాగైతే బయటకు కనిపించదో.. అలాగే సాఫ్ట్‌ ఎమోషన్‌ కూడా కనిపించదు. కానీ సినిమా సోల్‌ మొత్తం ఆ పాటలోని భావోద్వేగంలోనే దాగి ఉంటుంది’ అని చెప్పారు. అంతేకాదు సినిమాను డిసెంబరు మొదటి వారంలో ట్రైలర్ రిలీజ్ చేస్తామని, అందుకోసం వరుసగా ప్రీ రిలీజ్‌ వేడుకలు ఏర్పాట్లు చేస్తున్నమని తెలిపారు.

Next Story

Most Viewed