- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'ఆర్ఆర్ఆర్' నుంచి ఉగాది కానుక
<p>దిశ, వెబ్‌డెస్క్: అనుకున్నట్లుగానే ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి ఉగాది కానుక వచ్చేస్తోంది. తెలుగు వారి కొత్త సంవత్సరం సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. ఈ సంక్షోభ సమయంలో మీలో ఉత్సాహాన్ని నింపేందుకు మా నుంచి ఈ కానుక అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయగా… ఆన్ లైన్‌లో థ్రిల్‌ను ఎంజాయ్ చేయాలని సూచించారు దర్శకులు రాజమౌళి. ఇలాంటి సమయంలో ఎక్కువ మంది కలిసేందుకు అనుమతి లేదని… ఫ్లెక్సీలు, […]</p>

దిశ, వెబ్‌డెస్క్: అనుకున్నట్లుగానే ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి ఉగాది కానుక వచ్చేస్తోంది. తెలుగు వారి కొత్త సంవత్సరం సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. ఈ సంక్షోభ సమయంలో మీలో ఉత్సాహాన్ని నింపేందుకు మా నుంచి ఈ కానుక అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయగా… ఆన్ లైన్‌లో థ్రిల్‌ను ఎంజాయ్ చేయాలని సూచించారు దర్శకులు రాజమౌళి. ఇలాంటి సమయంలో ఎక్కువ మంది కలిసేందుకు అనుమతి లేదని… ఫ్లెక్సీలు, ప్రింట్ లాంటివి పెట్టరాదని.. ఇంట్లో నుంచే ఈ అప్‌డేట్‌ను ఎంజాయ్ చేయాలని కోరారు.
పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఫిక్షనల్ మూవీ ‘RRR’లో ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్‌లు హీరోలు కాగా … అలియా భట్, అజయ్ దేవగన్, సముతిరఖని ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకధీరుడు జక్కన్న దర్శకత్వంలో వస్తున్న సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు.
Tags: RRR, SS Rajamouli, NTR, Ram Charan Tej, Danayya, DVV






