బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్.. బరిలో క్రిస్ గేల్

5

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ఈ‌ సీజన్‌లో పంజాబ్‌ జట్టుకు డిసైడర్ మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభంకానుంది. ఇప్పటికే 7 మ్యాచులు ఆడిన పంజాబ్ కేవలం ఒక మ్యాచ్‌లోనే గెలుపొందింది. దీంతో ఇక నుంచి ప్రతీ మ్యాచ్‌లో గెలిస్తేనే సీజన్‌లో ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. అయితే, 31వ మ్యాచ్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడనుంది. ఈ నేపథ్యంలోనే టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఛేదనలో పంజాబ్ ఏ విధంగా ఆడనుందో వేచి చూడాల్సిందే. ఇక ఇదే మ్యాచ్‌తో క్రిస్ గేల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో మ్యాచ్ పై అంచనాలు మరింతగా పెరిగాయి.