బెంగళూరు ఘన విజయం

by  |
బెంగళూరు ఘన విజయం
X

దిశ,, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 25వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పై బెంగళూరు ఘన విజయం సాధించింది. 37 పరుగుల భారీ తేడాతో విక్టరీ కొట్టింది. చెన్నై బ్యాట్స్‌మెన్లు వచ్చిన వాళ్లు వచ్చినట్టే అవుట్ కావడంతో కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగారు. అంబటి రాయుడు (42), జగదీశన్ (33) తప్ప ఏ ఆటగాడు కనీసం 20 పరుగులు మించి చేయలేకపోయారు. దీంతో చెన్నై ఓటమి చెందక తప్పలేదు. నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులతోనే సరిపెట్టుకుంది.

ఓపెనర్లు ఢమాల్:

170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టుకు ఓపెనర్లు ఢమాల్ అనిపించారు. షేన్ వాట్సన్(14), డుప్లెసిస్(8) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన అంబటి రాయుడు (42), జగదీశన్ (33) పరుగులతో పర్వాలేదనిపించారు. కానీ, మిగత ఏ ఆటగాళ్లు పట్టుమని పది పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరారు. ధోని (10), శామ్ కుర్రాన్ (0), రవీంద్ర జడేజా (7), బ్రావో (7) పరుగులు మాత్రమే చేసి చేతులెత్తేశారు. ఆ తర్వాత వచ్చిన దీపక్ చాహర్( 5*), శార్దుల్ ఠాకూర్ (1*) నాటౌట్‌గా నిలిచి నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 132 పరుగులు మాత్రమే చేశారు. దీంతో 37 పరుగుల భారీ తేడాతో బెంగళూరు విజయం సాధించిం

తొలి ఇన్నింగ్స్:

చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. బ్యాక్ టు ఫామ్ అంటూ బౌండరీల మోత మోగించాడు. వన్‌డౌన్‌లో వచ్చి చివరివరకు కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు. 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టిన కోహ్లీ 90 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 13 పరుగులు ఉన్నప్పుడు క్రీజులో నిలబడి ఆర్సీబీ స్కోర్‌ బోర్డును 169కి లాక్కెల్లాడు.

ఓపెనర్లు విఫలం:
ఓపెనర్ ఫించ్ (2), దేవదత్ పడిక్కల్(34), డివిలియర్స్(0) డకౌట్‌తో పెవిలియన్ చేరిన కెప్టెన్ మాత్రం క్రీజులో స్థిరంగా నిలబడ్డాడు. ఆది నుంచి అంతిమం వరకు సమిష్ఠిగా రాణించాడు. ఇక మిడిలార్డర్‌లో వచ్చిన సుందర్ కూడా 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో 93 పరుగులకే బెంగళూరు నాలుగు వికెట్లను కోల్పోయింది.

దూబే సాయంతో..

ఇక ఆ తర్వా త 6వ స్థానంలో వచ్చిన శివం దూబే విరాట్‌ కోహ్లీకి మంచి భాగస్వామ్యం అందించాడు. శివం దూబే 14 బంతుల్లో 22 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (90)* ప్రత్యర్ఠులకు ఊహించని రీతిలో విరాటపర్వాన్ని చూపించాడు. దీంతో నిర్ధిష్ఠ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి బెంగళూరు 169 పరుగులు చేసింది.

స్కోరు బోర్డు:

Royal Challengers Bangalore Innings:

1. దేవదత్ పడిక్కల్ c డు ప్లెసిస్ b ఠాకుర్‌ 33(34)
2. ఆరోన్ ఫింఛ్ b డి. చాహర్ 2(9)
3. విరాట్ కోహ్లీ (c) నాటౌట్ 90(52)
4 .ఏబీ డివిలియర్స్ (wk)c ధోని b ఠాకుర్ 0(2)
5. వాషింగ్టర్ సుందర్ c ధోని b శామ్ కుర్రాన్ 10(10),
6. శివం దూబే నాటౌట్ 22(14)

ఎక్స్‌ట్రాలు: 12

మొత్తం స్కోరు: 169/4

వికెట్ల పతనం: 13-1 (ఆరోన్ ఫించ్, 2.5), 66-2 (దేవదత్‌ పడిక్కల్, 10.2), 67-3 (ఏబీ డివిలియర్స్, 10.5),
93-4 (వాషింగ్టర్ సుందర్, 14.3).

బౌలింగ్:

దీపక్ చాహర్ 3-0-10-1
శామ్ కుర్రాన్ 4-0-48-1
శార్దుల్ ఠాకుర్ 4-0-40-2
డ్వెయిన్ బ్రావో 3-0-29-0
కర్ణ్ శర్మ 4-0-34-0
రవీంద్ర జడేజా 2-0-7-0

Chennai Super Kings Innings:

1. షేన్ వాట్సన్ b వాషింగ్టన్ సుందర్ 14(18)
2. డు ప్లెసిస్ c క్రిస్ మోరిస్ b వాషింగ్టన్ సుందర్ 8(10)
3. అంబటి రాయడు b ఉదాన 42(40)
4. జగదీశన్ రనౌట్ (క్రిస్ మోరిస్) 33(28)
5.ఎంఎస్ ధోని (c) (wk)c గురుక్రీత్ సింగ్ b చాహల్ 10(6)
6. శామ్ కుర్రాన్ c డివిలియర్స్ b క్రిస్ మోరిస్ 0(1)
7. రవీంద్ర జడేజా c గురుక్రీత్ సింగ్ b క్రిస్ మోరిస్ 7(6)
8. డ్వెయిన్ బ్రావో c దేవదత్ పడిక్కల్ b క్రిస్ మోరిస్ 7(5)
9.దీపక్ చాహర్ నాటౌట్ 5(5)
10.శార్దుల్ ఠాకూర్ నాటౌట్ 1(1)

ఎక్స్‌ట్రాలు: 5
మొత్తం స్కోరు: 132/8

బౌలింగ్:

క్రిస్ మోరిస్ 4-0-19-3
నవదీప్ సైని 4-0-18-0
ఇసురు ఉదాన 4-0-30-10
వాషింగ్టన్ సుందర్ 3-0-16-2
యూజువేంద్ర చాహల్ 4-0-35-1
శివం దూబే 1-0-14-0.

పాయింట్ టేబుల్

Next Story

Most Viewed