- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులపై రౌడీషీట్ నమోదు
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో టీడీపీ నేతలపై కేసుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులపై కోటబొమ్మాళి పోలీసులు రౌడీషీట్, 107 బైండోవర్ కేసులు నమోదు చేశారు. అచ్చెన్నాయుడు సోదరుడు హరివరప్రసాద్, ఆయన కుమారుడు సురేష్, సమీప బంధువు కృష్ణమూర్తిపై రౌడీషీట్స్‌ను తెరిచారు. వీరిపై ఈ ఏడాది హత్యాయత్నం కేసులతోపాటు ఉద్యోగుల విధి నిర్వహణలో అడ్డుతగలడం, వారిపై దాడి కేసులు ఉన్నాయి. ఈ ముగ్గురిపై 107 బైండోవర్ కేసులు నమోదు చేసి […]</p>

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో టీడీపీ నేతలపై కేసుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి కుటుంబ సభ్యులపై కోటబొమ్మాళి పోలీసులు రౌడీషీట్, 107 బైండోవర్ కేసులు నమోదు చేశారు. అచ్చెన్నాయుడు సోదరుడు హరివరప్రసాద్, ఆయన కుమారుడు సురేష్, సమీప బంధువు కృష్ణమూర్తిపై రౌడీషీట్స్‌ను తెరిచారు. వీరిపై ఈ ఏడాది హత్యాయత్నం కేసులతోపాటు ఉద్యోగుల విధి నిర్వహణలో అడ్డుతగలడం, వారిపై దాడి కేసులు ఉన్నాయి.
ఈ ముగ్గురిపై 107 బైండోవర్ కేసులు నమోదు చేసి కోటబొమ్మాళి తహాశీల్దార్ ఎదుట ఒక్కొక్కరికి రూ.1,000,00 బైండోవర్ వేశారు. అయినప్పటికీ బైండోవర్‌ను ఉల్లంఘించి క్రిమినల్ కేసుల్లో ముద్దాయిలుగా ఉండటంతో రౌడీషీట్లు తెరిచినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఏపీలో ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేసి వైసీపీ సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగా లేనిపోని కేసులు బనాయిస్తుందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.






